నేను సంస్థలోని ఎవరినైనా ఖాతాను సృష్టించేందుకు ఏ విధంగా అనుమతించాలి?

లింక్‌ను కాపీ చేయి
కంప్యూటర్ సహాయం
ఈ విశేషాంశాన్ని ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా వ్యవస్థ నిర్వహణాధికారి అయ్యి ఉండాలి.
మీరు సంస్థలోని ఎవరినైనా ఖాతాను సృష్టించేందుకు ఆహ్వానించేలా ఎంపికను ఆన్ చేయవచ్చు, తద్వారా వ్యక్తులు ఇతర ఉద్యోగులను Workplaceలో చేరమని ఆహ్వానించగలిగేలా చేయవచ్చు లేదా వారంతట వారే వారి కోసం ఖాతాలను సృష్టించవచ్చు. వ్యక్తులు తమ సహోద్యోగులను జాబితా రూపంలో అధిక సంఖ్యాక అప్‌లోడ్ ద్వారా ఆహ్వానించవచ్చు లేదా సహోద్యోగులను ఒక్కొక్కరిగా ఆహ్వానించవచ్చు. సంస్థ ఇమెయిల్ చిరునామాను కలిగిన ఉద్యోగులు మాత్రమే Workplaceలో చేరమని ఆహ్వానించవచ్చు.
ప్రతిఒక్కరికీ ఆహ్వానాన్ని ఆన్ చేయడానికి:
  1. Workplace ఎగువ కుడిభాగంలో క్లిక్ చేయండి, తర్వాత కంపెనీ డాష్‌బోర్డ్‌ను క్లిక్ చేయండి.
  2. సెట్టింగ్‌లు క్లిక్ చేయండి.
  3. సంస్థలో చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ చిరునామాను కలిగి ఉన్న ఎవరైనా వాక్యం ప్రక్కన ఉన్న పెట్టెను ఎంచుకోండి. మీ సంస్థకు చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ డొమైన్ సెట్ లేకుంటే ఈ ఎంపిక నిలిపివేయబడుతుందని గుర్తుంచుకోండి.
  4. పేజీకి దిగువ భాగాన ఉన్న సేవ్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

పై సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నారా?

అవును
కాదు