Workplace గోప్యతా విధానం


Workplace from Meta అనేది Meta ద్వారా సృష్టించబడిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్, వినియోగదారులు కార్యాలయంలో సహకరించుకోవడానికి మరియు సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఇది అనుమతిస్తుంది. Workplace ప్లాట్‌ఫారమ్ సమిష్టిగా "సేవ" అని పిలువబడే Workplace వెబ్‌సైట్‌లు, యాప్‌లు మరియు సంబంధిత ఆన్‌లైన్ సేవలు వంటి వాటిని కలిగి ఉంటుంది.
మీరు సేవను ఉపయోగించినప్పుడు మీ సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం మరియు షేర్ చేయడం వంటివి ఎలా చేయబడతాయి అనే విషయాన్ని ఈ గోప్యతా విధానం వివరిస్తుంది.
ఈ సేవ సంస్థలు మరియు వాటి సూచనల ప్రకారం ఉపయోగం కోసం ఉద్దేశించబడడంతో పాటు సేవ (మీ "సంస్థ")కి మీ యాక్సెస్ మరియు వినియోగానికి అధికారం ఇచ్చిన మీ యజమాని లేదా ఇతర సంస్థ ద్వారా మీకు అందించబడుతుంది.
మీరు ఉపయోగించగల ఇతర Meta సేవల నుండి సేవ వేరుగా ఉంటుంది. ఆ ఇతర Meta సేవలు Meta ద్వారా మీకు అందించబడడంతో పాటు వాటి స్వంత నిబంధనల ప్రకారం నిర్వహించబడతాయి. అయితే, సేవ మీ సంస్థ ద్వారా అందించబడడంతో పాటు ఈ గోప్యతా విధానం అలాగే Workplace ఆమోదయోగ్యమైన వినియోగ విధానం మరియు Workplace కుక్కీల విధానం ద్వారా నిర్వహించబడుతుంది.
మీ Workplace ఖాతా ("మీ ఖాతా")కి మీ సంస్థ బాధ్యత వహించడంతో పాటు దానిని నిర్వహిస్తుంది. సేవ ద్వారా మీరు సమర్పించే లేదా అందించే ఏదైనా డేటా సేకరణ మరియు వినియోగానికి కూడా మీ సంస్థ బాధ్యత వహించడంతో పాటు అలాంటి ఉపయోగం మీ సంస్థ Metaతో కలిగి ఉన్న నిబంధనల మేరకు నిర్వహించబడుతుంది.
ఈ గోప్యతా విధానానికి అదనంగా, మీ సంస్థ మీ సేవ వినియోగానికి సంబంధించి వర్తించే అదనపు విధానాలు లేదా ప్రవర్తనా నియమావళిని కలిగి ఉండవచ్చు.
మీ సేవ వినియోగం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, దయచేసి మీ సంస్థను సంప్రదించండి.

I. ఎటువంటి రకాల సమాచారం సేకరించబడుతుంది?
మీరు, మీ సహోద్యోగులు లేదా ఇతర వినియోగదారులు సేవలను యాక్సెస్ చేసినప్పుడు మీ సంస్థ క్రింది రకాల సమాచారాన్ని సేకరిస్తుంది:
  • పూర్తి పేరు మరియు ఇమెయిల్ చిరునామా వంటి మీ సంప్రదింపు సమాచారం;
  • మీ వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్;
  • మీ కార్యాలయం లేదా సంస్థకు సంబంధించిన మీ కార్యాలయ శీర్షిక, విభాగ సమాచారం మరియు ఇతర సమాచారం;
  • మీరు ఖాతా కోసం సైన్ అప్ చేయడం, కంటెంట్‌ని సృష్టించడం లేదా షేర్ చేయడం మరియు ఇతరులకు సందేశం పంపడం లేదా కమ్యూనికేట్ చేయడం వంటివి చేసిన సందర్భాలతో సహా మీరు సేవను ఉపయోగించినప్పుడు అందించే కంటెంట్, కమ్యూనికేషన్‌లు మరియు ఇతర సమాచారం. ఇందులో ఫోటో స్థానం లేదా ఫైల్‌ను సృష్టించిన తేదీ వంటి మీరు అందించే (మెటాడేటా వంటిది) కంటెంట్‌లోని లేదా దాని గురించిన సమాచారం ఉండవచ్చు;
  • ఇతర వ్యక్తులు సేవను ఉపయోగించినప్పుడు అందించే కంటెంట్, కమ్యూనికేషన్‌లు మరియు సమాచారం. ఇందులో మీ గురించిన సమాచారం ఉండవచ్చు, మీ ఫోటోను వారు ఎప్పుడు షేర్ చేసారు లేదా దానిపై కామెంట్ చేసారు, మీకు సందేశం ఎప్పుడు పంపారు లేదా మీ సంప్రదింపు సమాచారాన్ని ఎప్పుడు అప్‌లోడ్ చేసారు, సింక్ చేసారు లేదా దిగుమతి చేసారు వంటివి;
  • సేవ యొక్క ఇతర వినియోగదారులతో పూర్తి కమ్యూనికేషన్‍‌లు;
  • వినియోగదారు కమ్యూనికేషన్‌లు, ఫీడ్‌బ్యాక్, సూచనలు మరియు సంస్థకు పంపిన ఆలోచనలు;
  • బిల్లింగ్ సమాచారం; మరియు
  • సేవకు సంబంధించిన మద్దతు కోసం మీరు లేదా మీ సంస్థ మమ్మల్ని సంప్రదించినప్పుడు లేదా ప్లాట్‌ఫారమ్‌తో ఎంగేజ్ అయినప్పుడు మీరు మాకు అందించే సమాచారం.

II. మీ సంస్థ ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తుంది?
మీ సంస్థ మరియు ఇతర వినియోగదారుల కోసం మరియు మీ సంస్థ నుండి ఏవైనా ఇతర సూచనలకు అనుగుణంగా సేవను అందించడానికి మరియు మద్దతివ్వడానికి Metaని అనుమతించడానికి మీ సంస్థ ప్లాట్‌ఫారమ్ ప్రదాతగా Metaతో సేకరించే సమాచారాన్ని షేర్ చేసుకుంటుంది. అలాంటి ఉపయోగానికి సంబంధించిన ఉదాహరణలలో ఇవి ఉంటాయి:
  • సేవను వారు ఉపయోగించడానికి సంబంధించి వినియోగదారులు మరియు నిర్వాహకులతో కమ్యూనికేట్ చేయడం;
  • అనుమానాస్పద కార్యాచరణ లేదా వర్తించే నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడం వంటి మీ సంస్థ మరియు ఇతర వినియోగదారులకు సేవ యొక్క భద్రత మరియు సురక్షతను మెరుగుపరచడం;
  • మా సేవా నిబంధనలో భాగంగా మీ మరియు మీ సంస్థ అనుభవాన్ని వ్యక్తిగతీకరించడం;
  • మీ సంస్థకి సంబంధించిన సేవలో కొత్త టూల్‌లు, ఉత్పత్తులు లేదా సేవలను అభివృద్ధి చేయడం;
  • సేవ యొక్క పూర్తి ఆపరేషన్‌ను మెరుగుపరచడానికి ఒకే వ్యక్తి ద్వారా నిర్వహించబడే వివిధ పరికరాలలోని సేవలో కార్యాచరణను అనుబంధించడం;
  • ఉనికిలో ఉండే అవకాశం ఉన్న బగ్‌లను గుర్తించడానికి మరియు పరిష్కరించడానికి; అలాగే
  • సేవను మెరుగుపర్చేందుకు పరిశోధనతోపాటు డేటా మరియు సిస్టమ్ విశ్లేషణను నిర్వహించడం.

III. సమాచార వెల్లడి
సేకరించిన సమాచారాన్ని మీ సంస్థ ఈ క్రింది మార్గాలలో వెల్లడిస్తుంది:
  • సేవను లేదా సేవలోని కొంత భాగాన్ని అందించడంలో సహాయపడే మూడవ-పక్ష సేవా ప్రదాతలకు;
  • మూడవ-పార్టీ అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌లు లేదా సేవ ద్వారా మీరు కనెక్ట్ కాగల ఇతర సేవలకు;
  • సేవ బదలాయింపు, విలీనం, సంఘటితీకరణ, ఆస్తుల అమ్మకం లేదా దివాలా లేదా దివాలాకోరుతనం వంటి అనూహ్య ఘటన వంటి వాస్తవమైన కార్పొరేట్ లావాదేవీతో సంబంధం ఉన్న్పప్పుడు;
  • ఎవరైనా వ్యక్తి భద్రతను కాపాడటానికి, వంచనతో, భద్రతతో లేదా సాంకేతిక సమస్యలతో వ్యవహరించడానికి; మరియు
  • న్యాయస్థాన హాజరుకు సమన్లు వంటి చట్టపరమైన అభ్యర్థనలు, వారెంట్, పరిశోధన ఆర్డర్ లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థ ఏజెన్సీ నుండి ఇతర అభ్యర్థన లేదా ఆర్డర్‌కు సంబంధించి ఉండడం.

IV. మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడం మరియు సవరించడం
సేవలోని (ఉదాహరణకు, కార్యాచరణ లాగ్ ద్వారా మీ ప్రొఫైల్ సమాచారాన్ని సవరించడం) టూల్‌లను ఉపయోగించడం ద్వారా సేవకు మీరు అప్‌లోడ్ చేసిన సమాచారాన్ని మీరు మరియు మీ సంస్థ యాక్సెస్ చేయడం, సరిచేయడం లేదా తొలగించడం వంటివి చేయవచ్చు. సేవలో అందించిన టూల్‌లను ఉపయోగించి మీరు అలా చేయలేనట్లయితే, మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి లేదా సవరించడానికి మీరు నేరుగా మీ సంస్థను సంప్రదించవచ్చు.

V. EU-U.S. డేటా గోప్యత ఫ్రేమ్‌వర్క్
EU-U.S. డేటా గోప్యత ఫ్రేమ్‌వర్క్‌లోని తన భాగస్వామ్యాన్ని Meta Platforms, Inc. ధృవీకరించింది. ఆ ధృవీకరణ లో పేర్కొన్న ఉత్పత్తులు మరియు సేవల కోసం, మేము U.S.లోని Meta Platforms, Inc.కి సమాచారాన్ని బదిలీ చేయడానికి EU-U.S. డేటా గోప్యతా ఫ్రేమ్‌వర్క్ మరియు యూరోపియన్ కమీషన్ యొక్క సంబంధిత సమర్ధత నిర్ణయంపై ఆధారపడతాము. మరింత సమాచారం కోసం, Meta Platforms, Inc. యొక్క డేటా గోప్యత ఫ్రేమ్‌వర్క్ వెల్లడిని దయచేసి సమీక్షించండి.

VI. మూడవ-పక్షం లింక్‌లు మరియు కంటెంట్
సేవ మీ సంస్థ నియంత్రించని మూడవ పక్షాల ద్వారా నిర్వహించబడే కంటెంట్‌కు లింక్‌లను కలిగి ఉండవచ్చు. మీరు సందర్శించే ఒక్కొక్క వెబ్‌సైట్ యొక్క గోప్యతా విధానాలను మీరు సమీక్షించవలసి ఉంటుంది.

VII. ఖాతా మూసివేత
మీరు సేవను ఉపయోగించడం ఆపివేయాలని కోరుకుంటున్నట్లయితే, మీరు మీ సంస్థను సంప్రదించవలసి ఉంటుంది. అదే విధంగా, మీరు సంస్థలో పని చేయడం ఆపివేసినట్లయితే, సంస్థ మీ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేస్తుంది మరియు/లేదా మీ ఖాతాతో అనుబంధితమైన ఏదైనా సమాచారాన్ని తొలగిస్తుంది.
ఖాతాను మూసివేసిన తర్వాత ఖాతాను తొలగించడానికి సాధారణంగా 90 రోజులు పడుతుంది, అయితే కొంత సమాచారం మాత్రం తగినంత సమయం వరకు బ్యాక్‌అప్ కాపీలలో ఉండవచ్చు. సేవలో మీరు సృష్టించే మరియు షేర్ చేసే కంటెంట్ మీ సంస్థ యాజమాన్యంలో ఉంటుందని అలాగే మీ సంస్థ మీ ఖాతాను డీయాక్టివేట్ చేసినా లేదా రద్దు చేసినా కూడా సేవలోనే ఉండి యాక్సెస్ చేయగలదని దయచేసి గుర్తుంచుకోండి. ఈ విధంగా, మీరు సేవలో అందించే కంటెంట్ మీ కార్యాలయం సమయంలో మీరు రూపొందించే (ప్రెజెంటేషన్‌లు లేదా మెమోలు వంటి) ఇతర రకాల కంటెంట్‌ను పోలి ఉంటుంది.

VIII. గోప్యతా విధానానికి మార్పులు
ఈ గోప్యతా విధానం కాలానుగుణంగా అప్‌డేట్ చేయబడవచ్చు. అప్‌డేట్ చేయబడినప్పుడు దిగువన ఉన్న “చివరిగా అప్‌డేట్ చేయబడిన” తేదీ సవరించబడడంతో పాటు కొత్త గోప్యతా విధానం ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయబడుతుంది.

IX. కాంటాక్ట్
మీకు ఈ గోప్యతా విధానం లేదా Workplace ఆమోదిత వినియోగ విధానం గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, దయచేసి మీ సంస్థ అడ్మిన్ ద్వారా మీ సంస్థను సంప్రదించండి.
కాలిఫోర్నియాలో నివసించే వ్యక్తుల కోసం, మీరు మీ సంస్థ అడ్మిన్ ద్వారా మీ సంస్థను సంప్రదించడం ద్వారా మీ వినియోగదారు గోప్యతా హక్కుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 10 అక్టోబర్, 2023